తాజాగా బెంగుళూరులో ఏకకాలంలో జరిపిన సోదాల్లో సోనియాతో పాటు మరో వ్యాపారవేత్త భరత్, డీజే వచన్ చిన్పప్ప ఇళ్లలో డ్రగ్స్ బయటపడ్డాయి. దీంతో వీరందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరికి వీరికి నైజీరియా డ్రగ్స్ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా డ్రగ్స్ వ్యవహారంలో నటి సోనియా అగర్వాల్ అరెస్ట్ కాగా కొన్ని మీడియా సంస్థలు అత్యత్సాహంతో ఆమెకు బుదులుగా సినీ నటి సోనియా అగర్వాల్ ఫోటోను ప్రచురించాయి. పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో భయపడి ఆమె బాత్రూంలో దాక్కుందని,
అయినా లాక్కొచ్చి పోలీసులు ఆమెను అరెస్ట్ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. దీంతో అంతా 7/జీ బృందావన కాలనీ ఫేమ్ సోనియానే అనుకున్నారు. కానీ సోనియా ఆ వార్తలను కొట్టిపారేశారు. ఈ కేసుతో తనకు ఏ సంబంధం లేదని, అసలు పోలీసులు రైడ్ చేసింది తన ఇంట్లో కాదని, ఆ సమయంలో తాను కేరళలో షూటింగ్‌లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన గురించి తప్పుడు వార్తలు ప్రచురించిన మీడియా సంస్థలు, వెబ్‌సైట్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది.