in

4 heroines locked for rajinikanth’s coolie!

సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలి’ సినిమాకి అన్ని భాషల నుండి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఆగస్టు 14న ఈ సినిమా రిలీజ్ కానుంది. మరోపక్క ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే..ఈ సినిమాలో హీరోలతో పాటు హీరోయిన్ల సంఖ్య కూడా పెరుగుతూనే వస్తుందట. అలా అని ఆ హీరోయిన్లు ఆ నలుగురు హీరోలకి జోడీలుగా నటించడం లేదు. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే..‘కూలి’ సినిమాలో ఇప్పటికే శృతి హాసన్..

ప్రీతి అనే పాత్రకి ఎంపికయ్యారు. మరోపక్క పూజా హెగ్డే కూడా స్పెషల్ రోల్ చేస్తుంది. అలాగే రెబా మోనికా జాన్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఒక సీనియర్ హీరోయిన్ ను కూడా తీసుకున్నారట. రజినీకాంత్ కు జోడీగా ఆమె కనిపించబోతుందని తెలుస్తుంది. ఆమె పాత్ర సినిమాలో అత్యంత కీలకంగా ఉంటుందట. దీంతో ప్రస్తుతానికి ఆ పాత్రని రివీల్ చేయకుండా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ గా దాచి ఉంచినట్టు స్పష్టమవుతుంది..!!

kriti sanon New Brand Ambassador For Magic Moments vodka!

rakul preet reacts to social media influence and time wasting!