ప్రముఖ హాస్యనటుడు అలీ నిర్మాతగా మారారు. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బేనరుపై ఆయన నిర్మించే ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’ చిత్రం షూటింగ్ బుధవారం ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అలీ, నరేశ్ వీకే, మౌర్యానిపై చిత్రీకరించిన తొలి షాట్‌కు ఛాయాగ్రాహకుడు ఎస్.గోపాలరెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి తొలి క్లాప్ ఇచ్చారు. దర్శకులు బోయపాటి శ్రీను, బాబీ గౌరవ దర్శకత్వం వహించారు.
తెలంగాణా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ ‘మలయాళంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా తీస్తున్నాం. ఈ చిత్రదర్శకుడు కిరణ్, నేను చెన్నైలో ఒకే రూమ్‌లో ఉండేవాళ్లం. పెద్ద టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు’ అని తెలిపారు.