
కరోనా పుణ్యమా అని లాక్ డౌన్ అంటే ఏమిటో మనందరికీ తెలిసింది ఈ మధ్యనే, కానీ 2010 లోనే లాక్ డౌన్ ని అనుభవించాడు హీరో సందీప్ కిషన్. 2010 లో కరోనా లేదు మరి సందీప్ కిషన్ ఎందుకు లాక్ డౌన్ లో ఉన్నాడు తెల్సుకోవాలి అనుకొంటే ఈ స్టోరీ చదవండి. హీరో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న టైం లో మధుర శ్రీధర్ గారు తాను తీయబోతున్న స్నేహగీతం సినిమా లో ఛాన్స్ ఇచ్చి హైదరాబాద్ రమ్మన్నారు. సంతోషం గ హైదరాబాద్ వచ్చిన సందీప్ షూటింగ్ స్టార్ట్ అవటానికి ముందు 60 రోజులో వెయిట్ చేయవలసి వచ్చింది. హైదరాబాద్ లో సందీప్ కి ఫ్రెండ్స్ ఎవరు లేకపోవటం, అంటే సందీప్ పుట్టింది, పెరిగింది చెన్నై అందువలన, రోజు ఉదయం జిమ్ కి వెళ్లడం, వస్తూ రెంట్ కి ఒక డి.వి.డి. తెచ్చుకోవటం చూడటం, తినడం నిద్ర పోవటం. ఎట్టకేలకు స్టార్ట్ అయింది ఒక వారం షూటింగ్ జరింగింది, తరువాత మళ్ళి లాక్ డౌన్ ౦.2 మొదలయ్యింది, అంటే మళ్ళి 50 డేస్ షూటింగ్ లేదు, ఆ టైం లో శర్వానంద్ గారి అక్క, శిరీష గారు ప్రస్థానం సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయి వెళ్ళమని పంపించటం, దేవ్ కట్టా ఆ మూవీ లో శర్వానంద్ కి బ్రదర్ గ సందీప్ ను సెలెక్ట్ చేయటం జరిగింది. ప్రస్థానం సినిమా సందీప్ కిషన్ కి ఒక గుర్తింపు తెచ్చిన మూవీ గ నిలిచింది. ఆ విధం గ సందీప్ కిషన్ గారు 2010 లోనే రెండు లాక్ డౌన్ లు అనుభవించారు.అదండి విషయం సందీప్ కిషన్ సినీ ప్రస్థానం లాక్ డౌన్ లతో మొదలయ్యింది అన్న మాట..

