in

200 crore PMLA case: ED chargesheet names Jacqueline Fernandez as accused

రూ200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) షాక్‌ ఇచ్చింది. సుకేశ్‌ చంద్రశేఖర్‌ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ.200 కోట్ల మనీ లాండరింగ్‌ కేసులో జాక్వెలిన్‌ని నిందితురాలిగా ఈడీ పరిగణించింది. ఈ మేరకు జాక్వెలిన్‌ పేరును ఢీల్లీ కోర్టుకు సమర్పించిన  స‌ప్లిమెంట‌రీ ఛార్జ్‌షీట్‌లో చేరుస్తూ..ఆమెను నిందితురాలిగా పేర్కొంది. రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లను రూ.200 కోట్లకు మోసం చేసిన కేసులో సుకేశ్‌ చంద్రశేఖర్‌ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

అతనితో జాక్వెలిన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈడీ విచారణలో తేలింది. అతని నుంచి ఖరీదైన బహుమతులను పొందినట్లు గుర్తించారు. ఇప్పటికే జాక్వెలిన్‌కు చెందిన రూ.7.27 కోట్ల ఆస్తులను  ఈడీ అటాచ్‌ చేసింది. రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్‌ సింగ్‌, శివిందర్‌ సింగ్‌కు బెయిల్‌ ఇప్పిస్తామని నమ్మించి వారి భార్యల నుంచి రూ. 200 కోట్లు వసూల్‌ చేశాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌. ఆ తర్వాత బెయిల్‌ విషయాన్ని దాటవేశాడు. దీంతో శివిందర్‌ సింగ్‌ భార్య అదితి సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గతేడాదిలో ఢిల్లీ పోలీసులు సుకేశ్‌ అరెస్ట్‌ చేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన ఈడీ.. ఇప్పటికే 8 మందిని అరెస్ట్‌ చేసింది..!!

Why Sai Pallavi Refused To Act With Vijay Devarakonda?

‘Agent’ beauty Sakshi Vaidya signs three mega projects!