నిధి అగర్వాల్ కుర్ర హీరోల సరసన నటించి మంచి సక్సెస్ లు అందుకుంటూ ఉన్న ఈ భామ ఇప్పుడు ఇద్దరు పెద్ద హీరోల సరసన ఛాన్స్ కొట్టేసి అందరిని ఆశ్చర్యపరచింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నిధి అగర్వాల్ ఫేట్ మారింది. ఈ భామకి ముందుగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఈ అవకాశంతో ఎగిరి గంతేసిన నిధికి మరో గోల్డెన్ అవకాశం అందింది..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ చిత్రంలోను నిధి కథానాయికగా నటిస్తుంది. అయితే ఒకే రోజు రెండు బిగ్ బడ్జెట్ చిత్రాల్లో నటించడం అంటే ఈ రోజుల్లో అంత సాధారణమైన విషయం కాదు. కాని నిధి అగర్వాల్ ఆ టాస్క్‌ను ఎంతో సాఫీగా పూర్తి చేయగలిగింది. రెండు సినిమాల్లో నటించడం గురించి తాజాగా నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు పాన్ ఇండియా సినిమాలలో తాను నటిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అని తెలియజేసింది..!!