ఎన్నో అంచనాలతో హాట్ స్టార్‌లో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ప్రేక్షకుల మందుకు వచ్చింది. అయితే ఈ షో మొదటి వారం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదని తెలుస్తోంది. నిజానికి OTTలో ఈ షో ప్లాన్ చేసినప్పుడు 24 గంటలూ లైవ్ వస్తుందని చెప్పారు కానీ .. ఒక్కరోజు మొత్తం షోని నిలిపివేయడమే కాకుండా, 24 గంటల కంటెంట్‌ని గంటకు కుదించారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ లవర్స్ కూడా ఈ రియాల్టీ షో పైన ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తోంది..అయితే ఈ షో పైన ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి ప్రధానంగా అయిదు కారణాలను గమనించవచ్చు..!
బిగ్‌బాస్ షోని 24 గంటలు OTTలో పెట్టడాన్ని మొదటి నుంచి ప్రేక్షకులు వ్యతిరేకించారు.. 24 గంటలు షోని ఫాలో అవ్వాలి అంటే అది జరగని పని.. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు.. సో దీనితో షో పైన ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ పోయింది. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో సీనియర్లు, జూనియర్లు మిక్స్ అవ్వడం కూడా షోపై ఆసక్తిని తగ్గించింది. కనీసం ఫేమస్ సెలబ్రిటీలనైనా తీసుకొని వస్తే షో మరో రేంజ్‌లో ఉండేదేమో… కానీ, ఆల్రెడీ బిగ్‌బాస్ షోలో పాల్గొన్న వాళ్ళే మళ్ళీ ఇందులో కూడా ఉండడం, వారి ఆట ఎలా ఉంటుందో ప్రేక్షకులు చూశారు కాబట్టి ప్రేక్షకులలో షో పైన ఆసక్తిని తగ్గించింది.