in

2 heroines for Venkatesh, Anil Ravipudi crime entertainer!

నిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రూపొందనున్న కొత్త సినిమా రేపు ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎక్స్ పోలీస్ ఆఫీసర్ గా వెంకటేష్ చాలా విభిన్నమైన పాత్రను చేస్తున్నట్టు ఆల్రెడీ ప్రీ లుక్ పోస్టర్ లో హింట్ ఇచ్చారు. మరో అప్డేట్ ఏంటంటే భార్యగా ఐశ్యర్య రాజేష్, మాజీ ప్రియురాలిగా మీనాక్షి చౌదరి కనిపిస్తారట. ఈ ముగ్గురి మధ్య కనెక్షన్ తో పాటు ఊహించని ఒక యాక్షన్ క్రైమ్ ఎలిమెంట్ అనిల్ రావిపూడి జొప్పించినట్టు ఇన్ సైడ్ టాక్. ఇతనితో వెంకీ కాంబోలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 ఏ రేంజ్ లో అలరించాయో వసూళ్ల సాక్షిగా చూశాంగా. మొత్తానికి వెంకటేష్ టైమింగ్ ని రావిపూడి మరోసారి పిండుకోవడం ఖాయమే. 2025 సంక్రాంతి విడుదల లక్ష్యంగా పెట్టుకుని దానికి అనుగుణంగానే చేయబోతున్నారు..!!

Harish Shankar gets green signal from Megastar!

actress hina khan diagnosed with breast cancer!