టాలీవుడ్ నుంచి మరో భారీ ప్రాజెక్టు రాబోతున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ మీద కళానిధి మారన్ దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ మూవీ అనౌన్స్ మెంట్ చాలా డిఫరెంట్ గా చేశారు. అప్పటినుంచి ఈ మూవీపై హైప్ పెరుగుతోంది. అయితే ఈ మూవీ గురించి తాజాగా ఓ అప్డేట్ వినిపిస్తోంది..
ఈ భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా పూజా కార్యక్రమం రీసెంట్ గా ముంబైలో సింపుల్ గా జరిగినట్టు తెలుస్తోంది. ఈ సినిమా గురించి ఏ ఒక్క లీక్ బయటకు రాకుండా ప్లాన్ చేస్తున్నారంట. అందుకే పూజా కార్యక్రమాన్ని కూడా సీక్రెట్ గా చేసినట్లు తెలుస్తోంది. మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ముంబై తో పాటు విదేశాల్లో ఈ మూవీ షూటింగ్ ఉంటుందంట. ఎక్కువ భాగం విదేశాల్లోనే షూట్ చేస్తారని సమాచారం..!!