రామ్ గోపాల్ వర్మ, ఈ పేరే ఒక సంచలనం, ఒక కాంట్రవర్సి, ఆయన మాట చిత్రంగా ఉంటుంది, అయన వాదం డిఫరెంట్ గ ఉంటుంది ఆయనను కాసేపు వింటే ఎస్, వర్మ చెపుతుంది కరెక్టే కదా అనిపిస్తుంది, ఆయన లోకం వోడ్కా లోకం, ఆయన నైజం, రాముయిజం. సమాజంలోని ప్రముఖులను ఆయన పట్టించుకోడు, ఎందుకంటె అందరికంటే నేనే ప్రముఖుడిని, ఇంకొకడితో నాకేంటి పని అనుకంటారు. దానికి చక్కటి ఉదాహరణ ఈ సంఘటన. ఒక సారి ఎయిర్ పోర్ట్ లో క్రికెటర్ ధోని, వర్మను చూసి దగ్గరకు వెళ్లి హలో సర్, అని పలకరించారట, ధోని ని కింద నుంచి పైదాకా నిశితంగ తన స్టయిల్లో చూసిన RGV
చెబులో నుంచి విసిటింగ్ కార్డు తీసి ధోని చేతిలో పెట్టి, రేపు ఆఫీస్ కి వచ్చి కలవమని చెప్పి వెళ్లి పోయారట. అయోమయం గ చూసిన ధోని కి, కాస్త లేటుగా అర్ధం అయింది ఆర్.జీ. వి. తనను గుర్తు పట్టలేదని. ధోని ఏమన్న అమ్మాయ? తొడలు చూసి గుర్తు పట్టడానికి, అమ్మాయి ఐతే తప్పకుండ గుర్తు పట్టి ఉండే వాడు వర్మ, మనోడి లోకం వేరే అని తెలియని ధోని ఒకింత ఆశ్ఛర్య పోయిన, ఆ తరువాత లైట్ గ తీసుకున్నాడట. ఆ తరువాత నుంచి ఎవరినైనా పలకరించడానికి, ఒకటికి రెండు సార్లు అలోచించి పలకరించడం అలవాటు చేసుకున్నాడట ధోని. ఆర్.జీ.వి య మజాకా!!! మనతో పెట్టుకుంటే హెలికాప్టర్ షాట్ లు కాదు, వోడ్కా షాట్లే..!!