in

16 years for ‘jagadam’!

రామ్- సుకుమార్ ల కలయికలో 2007 లో వచ్చిన చిత్రం జగడం. మార్చి 16 , 2007 లో రిలీజ్ అయినా ఈ మూవీ నేటితో 16 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాంగా సోషల్ మీడియా లో అభిమానులు జగడం తాలూకా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ , ట్వీట్స్ చేస్తున్నారు. రామ్, ఇషా జంటగా నటించిన ఈ మూవీ లో ప్రదీప్ రావత్ విలన్ రోల్ చేసాడు. తన వీధిలో జరిగే పలు సంఘటనల పట్ల ఆకర్షితుడైన శీను (రామ్) చిన్నతనం నుంచే హింస వైపు మొగ్గుచూపుతాడు. పెద్దయ్యాకా ఏమవుతావు అని మాస్టారు ప్రశ్నిస్తే రౌడీనవుతాను అంటాను. నడిబజార్లో ఒకణ్ణి కొట్టిన మాణిక్యం (ప్రదీప్ రావత్) అతనికి ఆదర్శం.

మాణిక్యం వద్ద కుడిభుజంగా ఉండే లడ్డా (రవికుమార్ చౌదరి)తో పరిచయం కల్పించుకుంటాడు. ఆ తర్వాత తను చిన్నప్పటినుంచే అభిమానించే మాణిక్యం వద్ద చేరతాడు. ఇదే సమయంలో తను ప్రేమిస్తున్న సుబ్బలక్ష్మి (ఇషా) స్నేహితునికి సంబంధించిన ల్యాండ్ సెటిల్ మెంట్ తలకెత్తుకుంటాడు. దీంతో స్థలాన్ని ఖాళీ చేయించాలనకుంటున్న మాణిక్యానికి, శీనుకు తేడా వస్తుంది..ఆ తర్వాత ఇద్దరి మధ్య ఎలా జగడం నటించింది అనేది కథ. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.

jr ntr receives a hero’s welcome after Oscars 2023 success!

Saif Ali Khan confirmed to play antagonist in #NTR30 ?